Thursday, May 16, 2024

కరోనా మూలాలపై దర్యాప్తును చైనా అడ్డుకుంటోంది

- Advertisement -
- Advertisement -

China is blocking an investigation into corona source

 

చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం ప్రశ్నార్థకం ః అమెరికా

వాషింగ్టన్: కరోనా జన్మస్థలంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ రాష్ట్రంలో డబ్ల్యూూహెచ్‌ఒ దర్యాప్తు జరపకుండా ఆ దేశంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమెరికా ఆరోపించింది. అంతేగాక వైరస్ వ్యాప్తి ప్రారంభమైన ఏడాది తర్వాత ప్రశ్నార్థకమైన వ్యాక్సిన్లను ప్రపంచం ముందుకు తెచ్చిందంటూ చైనా తీరును తప్పు పట్టింది. కరోనా వైరస్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో పారదర్శకంగా వెల్లడించేలా చైనాను డిమాండ్ చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌పాంపియో కోరారు.

క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పారదర్శకంగా వెల్లడించకుండా వ్యాక్సిన్లను విడుదల చేస్తున్నారని చైనాపై పాంపియో ఆరోపణలు గుప్పించారు. చైనా వ్యాక్సిన్ల వల్ల ఆ దేశ ప్రజలేగాక, ప్రపంచ ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదమున్నదని పాంపియో అన్నారు. చైనా వ్యాక్సిన్ల భద్రత, సామర్థం ప్రశ్నార్థకమని ఆయన ఆరోపించారు. కరోనా వ్యాప్తి ప్రమాదవశాత్తు జరిగింది కాదని పాంపియో ఆరోపించారు.

ప్రజాస్వామిక దేశాలు ప్రజా ఆరోగ్యం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తాయని, నియంతృత్వ దేశమైన చైనా అందుకు భిన్నంగా సమాచారాన్ని దాచి పెడుతోందని ఆయన ఆరోపించారు. వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచానికి ఎదురు కానున్న ప్రమాదంపై హెచ్చరించకుండా ఆ దేశంలోని శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్‌ల గొంతు నొక్కిందని చైనా ప్రభుత్వంపై పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశంగా అమెరికా రికార్డులకెక్కింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే అక్కడ 3,13,000మంది చనిపోయారు. రికార్డుస్థాయిలో కోటీ 74 లక్షల 42 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News