Thursday, May 9, 2024

బ్రిటన్‌లో 70 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

Vaccination extension for people over 70 in Britain

 

లండన్: కరోనా కట్టడికి బ్రిటన్‌లో ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం నుంచి 70 ఏళ్లు పైబడినవారికి విస్తరించారు. ఇప్పటి వరకు 80 ఏళ్లు పైబడినవారితోపాటు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ను కొనసాగించారు. వీరిలో ఇప్పటికే సగంమందికిపైగా టీకాలు తీసుకున్నారని, దాంతో ఇప్పుడు 70 ఏళ్లు పైబడినవారికి ప్రారంభిస్తున్నామని బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి మధ్య వరకల్లా వీరందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాలగలదని వారు తెలిపారు. ఇక లక్షలమంది టీకాలు పొందుతారని, తమ దేశంలో ఇక నుంచి నిమిషానికి 140 మంది చొప్పున వ్యాక్సినేట్ అవుతారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News