Friday, May 10, 2024

ఓ ఇంటివాడైన క్రికెటర్ విజయ్ శంకర్

- Advertisement -
- Advertisement -

Vijay Shankar is married to Vaishali Vishweshwaran

 

చెన్నై : భారత క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ తన ప్రేయసి  వైశాలి విశ్వేశ్వరన్ ను  వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వైశాలిని పెళ్ళి చేసుకున్నాడు. ఐపిఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌ర‌పున మ్యాచ్‌లు ఆడ‌తున్న సంద‌ర్భంగా అత‌నికి స‌న్‌రైజ‌ర్స్ టీం ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్’ అంటూ విషెస్ తెలియ‌జేసింది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజ‌య్ శంక‌ర్‌కు టీమిండియా ఆట‌గాళ్లు రాహుల్, చాహ‌ల్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News