Saturday, May 4, 2024

ముందస్తు అనుమతి తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

Prior permission for corona patients coming to Telangana

హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కరోనా పేషెంట్లకు ముందస్తు అనుమతిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ గురువారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 040,2465119,9494438351నంబరు కు రోగి పూరి ్తవివరాలు, ఫోన్ నంబరు, అడ్రస్, రోగి సహయకుల వివరాలు, వయస్సు, చేరబోతున్న ఆసుపత్రి వివరాలను తప్పనిసరిగా చెప్పాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక అడ్మిట్ అయ్యే ఆసుపత్రి నుంచి లెటర్ ఉంటేనే కంట్రోల్ రూం పర్మీషన్ ఇస్తుందని సిఎస్ ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రోగులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 50 శాతం పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు అధికారిక వర్గాల తెలిపాయి. సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్న వాహనాలను పోలీసులు అక్కడే ఆపేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేషెంట్లకు సకాలంలో వైద్యం అందడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News