Wednesday, May 15, 2024

భారత్ @ 3.11 లక్షలు… 4077 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Corona 2nd wave cases highly hikes in India

ఢిల్లీ: కరోనా వైరస్ చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉంది. కరోనా ధాటికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గత 24 గంటల్లో 3.11 లక్షల కేసులు నమోదుకాగా 4077 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.46 కోట్లకు చేరుకోగా 2.7 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.07 కోట్ల మంది కోలుకోగా 36.18 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. 18.22 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు ఎక్కువగా  కర్నాటక (41,664), మహారాష్ట్ర(34,848), తమిళనాడు(33,658), కేరళ(32,680), ఆంధ్రప్రదేశ్(22,517) రాష్ట్రాలలో నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలలో 53.17 శాతం కేసులు నమోదైనట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. ఒక్క రోజు వ్యవధిలోని మహారాష్ట్ర(960), కర్నాటక(349)లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News