Saturday, May 11, 2024

మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు కేంద్రం ఒకె

- Advertisement -
- Advertisement -

Union Cabinet approves Model Tenancy Act

 

న్యూఢిల్లీ : దేశంలో మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరిగింది. సమ్మిశ్రిత రెంటల్ హౌసింగ్ మార్కెట్ వాతావరణం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా టెనెన్సీకి సంబంధించి సరైన చట్టపరమైన విధానాన్ని ఖరారు చేయడం ద్వారా, సంబంధిత రంగం సమగ్రాభివృద్ధికి ఇది దోహదం చేసేలా చట్టం రూపకల్పన జరిగింది. కేబినెట్ భేటీ తరువాత అధికార ప్రకటన వెలువరించారు. ఖాళీగా ఉన్న గృహాలను అద్దె ప్రాతిపదికన వాడుకునేందుకు ఈ యాక్ట్‌తో వీలేర్పడుతుంది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు దీనిని తగు విధంగా వాడుకునేందుకు అవకాశం కల్పించారు. కిరాయిదార్లు, గృహయజమానులు మధ్య ఉండే విశ్వాసలేమిని పూడ్చడం ద్వారా వివాదాస్పద నివాసాలను తిరిగి అద్దె ప్రాతిపదికన వాడుకునేందుకు ఇప్పటి యాక్ట్ ఉపయోగపడుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News