Monday, April 29, 2024

మాజీ సిఎస్ అలపన్ వివాదం ఇక ముగిసిన కథే: మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

Former CS Alapan chapter over :Mamatha

కోల్‌కతా: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ అంశంలో తలెత్తిన వివాదం ఇక ముగిసిన కథేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆయన విషయంలో తన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం బందోపాధ్యాయ్ బెంగాల్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం మమత అధ్యక్షతన జరిగిన ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ సమావేశంలో బందోపాధ్యాయ్ పాల్గొన్నారు. యాస్ తుపాన్‌పై ప్రధాని అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశానికి మమతతోపాటు బందోపాధ్యాయ్ హాజరు కాకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరు కాకపోవడం, కేంద్రం ఆదేశాలమేరకు రిపోర్ట్ చేయకపోవడంపై కేంద్ర హోంశాఖ బందోపాధ్యాయ్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ అయిన ఆ నోటీస్‌కు తగిన సమాధానం ఇవ్వడంలో బందోపాధ్యాయ్ విఫలమైతే ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బందోపాధ్యాయ్ మే 31న రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని అంతా భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News