Thursday, May 16, 2024

గోదావరి ఉగ్రరూపం

- Advertisement -
- Advertisement -

flood water level in Godavari River rises

ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
దిగువకు విడుదల
భద్రాచలం పెరుగుతున్న నీటిమట్టం

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన గోదావరి నదీ పరివాహకంగా మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండంతో గోదావరి నదిలో వరద నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పరివాహకంగా ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులు గరిష్ట స్థాయి నీటి మట్టాలు దాటేశాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి. తు పాకుల గూడెం సమ్మక్క బ్యారేజ్, సింగూరు, ని జాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి వరద నియం త్రణ చర్యలు పాటిస్తున్నారు. గోదావరితోపాటు దాని ఉపనదుల్లో వరవ ప్రవాహ ఉధృతిని గమని స్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా విష్ణుపురి, బాలేగావ్ ప్రాంతాలనుంచి ,ఉపనదుల ద్వారా వస్తున్న వరదనీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి 3.50లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోం ది. ప్రాజెక్టులో గేట్లు ఎత్తివేసి దిగువకు 3.13లక్షల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఇటు మంజీరా నదికూడ వరదనీటితో ఉధృతంగా పవహి స్తూ గోదావరిలో కలుస్తోంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో ఇప్పటికే ప్రాజేక్టు గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి 40,185క్యూసెక్కుల నీ రు వస్తుండగా, గేట్ల ద్వారా 35483క్యూసెక్కుల నీ టిని బయటకు విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లికి పోటెత్తిన వరద

గోదావరి వరద నీటితోపోటేత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేసి 18131క్కూసెక్కుల నీటిని వి డుదల చేయటంతో గోదావరిలో వదర ఉధృతి మ రింతగా పెరిగింది. ఎగువ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి 5,21,692క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. అధికారులు ఎగువ వస్తు న్న వరదనీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎల్లంపలి ప్రాజెక్టు 35గేట్లు ఎత్తివేసి 5,75,745క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 59,329క్యూసెక్కుల వరద చేరు తుండగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1,04,885 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ మానేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతిపెరిగింది.

భద్రాచలం వద్ద స్నానఘట్టాలు..

గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగు వస్తోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే స్నానఘట్టాలు నీటమునిగాయి.గోదావరిలో వరద ఉధృతి మరింతే పెరిగే అవకావాలు ఉన్నాయని ,ముందు జాగ్రత్తల తో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News