Thursday, May 9, 2024

‘లైగర్’ సెట్‌లో బాలయ్య

- Advertisement -
- Advertisement -

Balakrishna came to the ‘Liger’ set

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చేస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లైగర్’ సెట్‌కు వచ్చారు. గోవాకు దగ్గరలో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో ‘లైగర్’ సెట్‌లోకి వచ్చారు బాలకృష్ణ. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలయ్య ఆశ్చర్యపోయారు. ‘లైగర్’ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ టీంకు కంగ్రాట్స్ తెలిపారు నందమూరి బాలకృష్ణ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో రూపొందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News