Friday, May 17, 2024

బన్నీ జాతి గేదెకు మొదటి కృత్రిమ గర్భధారణ దూడ

- Advertisement -
- Advertisement -

India's first Banni Buffalo calf born

అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ రీజియన్ గిర్ సోమనాధ్ జిల్లాలో రైతు ఇంటిలో బన్నీ జాతి గేదెకు కృత్రిమ గర్భధారణ ద్వారా మొట్టమొదటి దూడ జన్నించింది. బన్నీ జాతి గేదెల పాల ఉత్పత్తి బాగా పెంపొందించడానికి ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా దూడలను ఉత్పత్తి చేసే ప్రక్రియను జన్యుపరంగా ఉత్తమమైన గేదెలకు విస్తరింప చేస్తామని అధికారులు శనివారం తెలిపారు. గిర్‌సోమనాధ్ జిల్లా లోని దనాజ్ గ్రామానికి చెందిన డైరీఫారం రైతు వద్ద మగదూడ జర్మించిందని తెలిపారు. కృత్రిమ గర్బధారణ ద్వారా బన్నీ జాతి గేదెకు జన్మించిన మొదటి దూడగా కేంద్ర మత్స, పశుసంవర్ధక శాఖలు అభివర్ణించాయి. 18 గేదెలకు ఈ విధంగా ప్రక్రియ నిర్వహించగా వాటిలో ఒక దానికి మగదూడ జన్మించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News