Monday, May 6, 2024

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కెటిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

Minister KTR letter to Union Minister Piyush Goyal

హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విన్నవించారు. సిపిసిడిఎస్ కింద పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విజ్జప్తి చేశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం కేంద్రానికి ఇప్పటికే 7 లేఖలు రాసినట్టు మంత్రి వెల్లడించారు. తన లేఖలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధాని రాలేదని కెటిఆర్ పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రాంతం చేనేతకు హబ్ గా ఉందని ఆయన లేఖలో తెలిపారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోటీపడి రాష్ట్రం పెట్టుబడులు సాధిస్తోందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో చేనేత రంగానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. వనరులు లేని రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందన్నారు. వనరులుండీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని విస్మరిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. క్లస్టర్ లో పనిచేసేందుకు యువత ఎదురుసూస్తోందన్నారు. జాప్యం చేయకుండా సిరిసిల్లకు క్లస్టర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News