Thursday, May 16, 2024

ఫిబ్రవరి 4న వస్తున్న ఆచార్య

- Advertisement -
- Advertisement -

Acharya Release on February 4th

 

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను నిర్మాతలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అందరి అంచనాలకు తగినట్లే ఆచా ర్య సినిమా ఉంటుంది అన్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News