Saturday, April 27, 2024

విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం

- Advertisement -
- Advertisement -
సింగపూర్‌కు చెందిన ప్రమోషనల్ డిజిటల్ సంస్థ యూనిక్యూ ప్రతినిధులతో సమావేశం
సిఎం కెసిఆర్ పర్యాటకాభివృద్ది పెద్ద పీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్:  రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన టూరిజం ప్రాంతాలున్న గత పాలకుల నిర్లక్ష్యానికి వాటికి గుర్తింపు లేదని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సింగపూర్‌కు చెందిన టూరిజం ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్‌కు చెందిన ప్రముఖ సంస్థ యూనిక్యూ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలకు ఏషియయన్ ఫసిఫిక్ దేశాలైనా మలేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్ షో లు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించటానికి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు.

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, అద్భుతమైన జలపాతాలు, సుందరమైన నదీ ప్రాంతాలు, యూకో అర్భన్ పార్కులు, అటవీ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు ,కోటలు, చారిత్రక సంపద, పురావస్తు, వారసత్వ సంపద, ఆధునిక జీవనశైలికి తెలంగాణ రాష్ట్రం గుర్తింపు కు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలను వివిధ దేశాలలో టూరిజం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. సింగపూర్ దేశానికి చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ యూనిక్యూ తెలంగాణ టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్‌పారం ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డైరెక్టర్ నిఖిల తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సింగపూర్ దేశానికి చెందిన యూనిక్యూ సంస్థ ప్రతినిధులు కెప్టెన్ కెపి తాన్, సేభాష్టియన్, లారెన్స్, అధికారులు సత్యనారాయణ , ఓం ప్రకాష్, సింగపూర్ సంస్థకు చెందిన కెప్టెన్ ప్రసన్నకుమార్, హర్ష ,అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News