Saturday, April 27, 2024

మొహాలి స్టేడియంలో క్లైమాక్స్ సీక్వెన్స్

- Advertisement -
- Advertisement -

A1 Express movie Climax Sequence at Mohali Stadium

 

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న న్యూ ఏజ్ స్పోర్ట్ ఎంటర్‌టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ చిత్రంలో హిప్ హాప్ తమిళ స్వరాలు కూర్చిన ‘సింగిల్ కింగులం’ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. ఇక ఇండియాలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అయిన పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు. ఈ సీక్వెన్స్‌లో నటించడం కోసం గత ఆరు నెలలుగా హాకీలో శిక్షణ తీసుకుంటూ వచ్చారు సందీప్ కిషన్. ఆ శిక్షణకు సంబంధించి ఇటీవల ఆయన షేర్ చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News