Friday, May 3, 2024

ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘పార్ట్‌నర్’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ, కామెడీ అండ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పార్ట్‌నర్’. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా బి.జి.గోవింద్ రాజు సమర్పణలో తెలుగు, తమిళ్‌లో ఏకకాలంలో ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

‘’హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ’పార్ట్‌నర్’ అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?” అన్నారు ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్. ఈ చిత్రంలో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పల్లక్ లాల్వానీ, పాండిరాజన్, రోబో శంకర్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News