Saturday, May 4, 2024

బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి

- Advertisement -
- Advertisement -

Actess Karate Kalyani join in BJP

హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.   సినీ నటి కరాటే కళ్యాణి, జల్ పల్లి కౌన్సిలర్ యాదయ్య సహా పలువురు సినీ నటులు, ఇతర పార్టీల నేతలు ఆదివారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి విజయశాంతి, మాజీ మంత్రి విజయరామారావు, మహిళా మోర్చా జాతీయ నేత ఐశ్వర్యా బిశ్వాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రంగారెడ్డి రూరల్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడారు. ఎందరో త్యాగాలతో దేశాన్ని దక్కించుకోగలిగామని, వారి త్యాగాలకు సెల్యూట్ అని,  తెలంగాణలో బిజెపి మాత్రమే సరైన పార్టీ అని కొనియాడారు, తెలంగాణ బిజెపి చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా ఎందరో సమర్ధులున్నారు. రాష్ట్రానికి సంజయ్ వంటి సమర్ధులున్నారని, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో స్వయంగా తెలుసుకునేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ప్రశంసించారు. సంజయ్ చేపటనున్న పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News