Friday, April 26, 2024

పేద విద్యార్థిని పాలిట ఆపద్బాంధవుడైన ప్రకాష్‌రాజ్

- Advertisement -
- Advertisement -
Actor Prakash Raj helps a poor student in AP
మాంచెస్టర్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చదివించడానికి సహాయం

హైదరాబాద్ : ఎదుటి వాళ్లకు సాయం చేయాలనే మంచి హృదయం ఉన్న వాళ్లలో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఒకరు. తాజాగా ఓ బ్రిలియంట్ స్టూడెంట్‌కు మాస్టర్ డిగ్రీ చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయడానికి ముందుకు వచ్చా రు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సిరిచందన స్కూల్ నుంచే అత్యుత్తమ ప్రతిభ కనభరుస్తూ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి సీటు వచ్చింది. అయితే ఆమెకు తండ్రి లేరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈక్రమంలో మాంచెస్టర్ వెళ్లేందుకు ఆ యు వది ఆశలు వదులుకుంది. అయితే విషయం తెసుకున్న ప్రకాష్‌రాజ్ ఆమెకు పాలిట ఆపద్బాంధవుడయ్యారు. ఆమెను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదివించడానికి ముందుకు వచ్చారు. దీంతో సిరిచందన, ఆమె తల్లి ఆనందానికి అవధులు లేవు. హైదరాబాద్ షూటింగ్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ను కలుసుకొని తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమెను భాగా చదువుకొని వృద్ధిలోకి రావాల్సిందిగా ప్రకాష్‌రాజ్ ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా సిరిచందన మాట్లాడుతూ.“నా పేరు తిగిరిపల్లి సిరిచందన. మాది పశ్చిన గోదావరి జిల్లాలోని పెద్దేవం గ్రా మం. నేను డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేయడానికి మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో సీటు వచ్చింది. కానీ మా నాన్నగాను నా చిన్నతనంలోనే చనిపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. మా అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించి ఇక్కడి దాకా తీసుకువచ్చింది. యూనివర్సిటీలో సీటు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లేందుకు నేనే ధైర్యం చేయలేదు.

ఎందుకంటే ఆర్థికం గా మా కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి న రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒకరు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పుడు అది ప్రకాష్‌రాజ్ చూసి తాను హెల్ప్ చేస్తానని ప్రకటించారు. అన్ని ఖర్చులు ఆయనే భరిస్తానని అన్నారు. ఆయన ఇచ్చిన ప్రేరణతో నేను భా గా చదువుకొని నాలాంటి స్థితిలో ఉన్న మరో నలుగురి కి సాయం చేయాలని అనుకుంటున్నాను. నిజానికి మాంచెస్టర్‌లో చదువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్రకాష్‌రాజ్ ఇచ్చిన సపోర్ట్ ఎన్నటికీ మర్చిపోలేం. బుక్స్ దగ్గర నుంచి కంప్యూటర్ దాకా ఆయన సమకూర్చి పెట్టారు. కచ్చితంగా ఆ విషయం లో ఆయనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని”ఆమె చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News