Wednesday, May 1, 2024

డ్రగ్స్ కేసులో సినీనటి సంజనకు బెయిల్

- Advertisement -
- Advertisement -

Actor Sanjjanaa Galrani gets bail

బెంగ‌ళూరు: శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి సంజనకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8న సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా ఆమె జైలులో ఉన్నారు. ఇటీవల సంజన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో సంజన మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన దర్మాసనం సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు లక్షల పూచీకత్తు ఇవ్వాలని,  ప్రతి నెల రెండు రోజులు పోలీసు స్టేషన్ లో హాజరు కావడంతో పాటు దర్యాప్తు సంస్థలకు సహకరించాలని సంజనను కోర్టు ఆదేశించింది.

Actor Sanjjanaa Galrani gets bail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News