Monday, April 29, 2024

మమ్మల్ని చంపినా బాలికల విద్య కోసం పోరాడతాం: అఫ్గాన్ టీచర్లు

- Advertisement -
- Advertisement -

Afghan Teachers Fight For Girls Education

కాందహార్ : తాలిబన్లు మహిళల హక్కులను గౌరవిస్తామన్న ప్రకటన నీటి మూటగా మారింది. మహిళలు, బాలికల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కో ఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తూ బాలికల అభ్యున్నతికి మంగళం పాడుతున్నారు. కానీ అక్కడి ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మాత్రం బాలిక విద్యకోసం పోరాడుతామని అభయమిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టైనా బాలికల విద్య కోసం పోరాటం చేస్తామంటున్నారు. కాందహార్ ప్రావిన్స్ లోని ఓ ఉపాధ్యాయుడు ఇదే విధంగా దృఢ నిశ్చయం వెల్లడించారు. తమ హక్కులకు భంగం కలిగించబోమని, పాఠశాలలకు వెళ్లకుండా ఆపబోమని తాలిబన్లు హామీ ఇచ్చారన్నారు. ఒక వేళ మమ్మల్ని అడ్డుకున్నా సరే తాము భయపడకుండా బాలికల విద్య కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. హెరాత్ ప్రావిన్స్ లోని విశ్వవిద్యాలయంలో కో ఎడ్యుకేషన్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో ఎడ్యుకేషన్ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఆచార్యులను మహిళా విద్యార్థుల బోధనకు మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News