Monday, April 29, 2024

తాలిబన్లతో చైనా చర్చలు

- Advertisement -
- Advertisement -
China talks with the Taliban
కాబూల్‌తో దౌత్యం తమకు కీలకమన్న చైనా

బీజింగ్: అఫ్ఘానిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లతో దౌత్య సంబంధాలను నెలకొలుపుకున్న మొదటి దేశంగా చైనా నిలిచింది. రెండుపక్షాల మధ్య ఎలాంటి అడ్డంకులులేని సమాచార సంబంధాలు ఏర్పడ్డాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ బుధవారం వెల్లడించారు. కాబూల్‌లో తాలిబన్ల డిప్యూటీ నేత అబ్దుల్‌సలామ్‌అనాఫీతో అఫ్ఘానిస్థాన్‌లోని తమ రాయబారి వాంగ్‌యు చర్చించారని వెన్‌బిన్ తెలిపారు. కీలక అంశాలు చర్చించడానికి కాబూల్ తమకు సహజంగానే ముఖ్యమైందని వెన్‌బిన్ అన్నారు. చర్చల సారాంశాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. తమ భవిష్యత్‌పై అఫ్ఘన్ ప్రజలు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాన్ని చైనా గౌరవిస్తుందని ఆయన అన్నారు. పొరుగు దేశమైన అఫ్ఘన్‌తో స్నేహం, సహకారాన్ని కొనసాగించేందుకు తాము సిద్ధమని ఆయన అన్నారు. ఆ దేశంలో శాంతిని నెలకొలపడానికి చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఆగస్టు 15న కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అమెరికా, భారత్‌సహా పలు దేశాలు తమ దౌత్య కార్యాలయాలు మూసివేయగా.. చైనా, పాకిస్థాన్,రష్యాలు కొనసాగించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News