Wednesday, May 1, 2024

ఆ నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం: మోడీ

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: గత ఎనిమిది నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఐదు సార్లు సమావేశమయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. రక్షణ, భద్రత, వాణిజ్యరంగాల్లో సహకారంపై చర్చలు జరిపామన్నారు. ఇంధన రంగంలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని, ఉగ్రవాదులను ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఆరోగ్య, ఇంధన అంశాలపై మూడు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సకుటుంబంగా భారత్ రావడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం కొనసాగుతోందని, సమాన అవకాశాలతో కూడిన స్వేచ్ఛాయుత వాణిజ్యంపై చర్చలు జరిపామని మోడీ పేర్కొన్నారు. నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందన్నారు.

 

The most important foundation of the special relationship between India and the USA is people to people contact. Professionals, students, the Indian diaspora in USA have a major contribution in this, Our commerce ministers have had positive talks on trade. Both of us have decided that our teams should give legal shape to these trade talks. We also agreed to open negotiations on a big trade deal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News