Saturday, April 27, 2024

అళగిరి రాజకీయ పయనంపై సర్వత్రా ఆసక్తి

- Advertisement -
- Advertisement -

Alagiri to discuss next political move today

చెన్నై: ఎమ్.కె అళగిరి రాజకీయ పయనంపై తమిళనాట సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు మద్దతుదారులతో స్టాలిన్ సోదరుడు అళగిరి భేటీ కానున్నాడు. అందుకోసం పాండికోయిల్ సమీపంలోని ద్వారకా ప్యాలెస్ లో భారీ ఏర్పాట్లు చేశారు. అళగిరి ఎటువైపు అడుగులు వేస్తారోనని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. నేడు మద్దతురారులతో నిర్వహిస్తున్న సభలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. గతంలో డిఎంకె నుంచి అళగిరి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కరుణానిధి ఆయనను బహిష్కరించారు. ఇటీవల రజనీకాంత్ లో చేతులు కలిపి అళగిరి సత్తా చాటాలనుకున్నారు. రజనీ పార్టీ పెట్టడం లేదని తేలడంతో ఆయన ఆశలు నీరుగారాయి. మద్దతుదారులతో సమావేశం అనంతరం అళగిరి ప్రకటన చేసే అవకాశముందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.

Alagiri to discuss next political move today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News