Wednesday, May 15, 2024

మరికొంత సమయం పడుతుందట

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా నటించనుంది. కరోనా లాక్‌డౌన్ లేకపోయుంటే ఈపాటికే అలియా పాత్ర షూటింగ్ కూడా పూర్తయ్యేది. ఇటీవలే ‘ఆర్.ఆర్.ఆర్’ షూట్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ బాలీవుడ్ బ్యూటీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌కి వచ్చి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అలియా ఆగమనానికి ఇంకొంత సమయం పట్టనుందని తెలిసింది. ఇంతకుముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం మంగళవారం నుంచి అలియా భట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. రాజమౌళి మరోసారి షూటింగ్ ప్లాన్‌ను మార్చారట. ముందుగా హీరోలు ఎన్టీఆర్,  రామ్‌చరణ్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేసి వాళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో అలియా భట్ వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ప్రకారమే అమ్మడు హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది.

Alia Bhatt to Join RRR Movie shoot in Dec

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News