Wednesday, May 15, 2024

తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు

- Advertisement -
- Advertisement -

Modi election campaign in Bihar

 

బీహార్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ

సహర్స: తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు శిక్ష విధించారని, దాంతో ఆ పార్టీ బలం పార్లమెంట్‌లో 100కు దిగువకు జారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో మంగళవారం ఓవైపు రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, ప్రధాని మోడీ మూడో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్‌డిఎ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. డబుల్ యువరాజుల్ని(కాంగ్రెస్ నేత రాహుల్, ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్) ఓడించాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, పేదరికాన్ని రూపుమాపుతామని ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని ప్రధాని అన్నారు. ఇటీవల వెల్లడైన 11 రాజ్యసభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకున్న బిజెపి బలం ఆసభలో 92కు ఎగబాకింది. కాంగ్రెస్ బలం 38కి పడిపోయింది. ప్రస్తుతం ఉభయసభల్లో కలిపి కాంగ్రెస్ బలం 100కు దిగువకు జారిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సహర్స, కతిహార్, పూర్ణియా, కిషన్‌గంజ్ జిల్లాల్లో ప్రధాని ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News