Saturday, April 27, 2024

లక్షద్వీప్ బ్యూటీలో మేటి: అమితాబ్ ట్వీటు

- Advertisement -
- Advertisement -

ముంబై : లక్షద్వీప్ లా జవాబు అని సూపర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. పర్యాటక స్థలాల విషయంలో లక్షద్వీప్, మాల్దీవుల నడుమ వివాదం రగులుకున్న దశలో అమితాబ్ దేశీ విడిదికే ఓటేశారు. అదో అత్యద్భుత అందాల నిలయం అని సోమవారం బిగ్‌బి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు, అధికారులు ప్రధాని మోడీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై క్రికెటర్లు, సినీ స్టార్లు బాయ్‌కాట్ మాల్దీవ్ ఉద్యమ పంథాలో వెళ్లుతున్న దశలో అమితాబ్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ నేపథ్యంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పొందుపర్చిన ట్వీటును అమితాబ్ పోస్టు చేశారు. దీనితో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

భారత్ ఇప్పుడు ఆత్మనిర్భరతకు ప్రతీక అయింది. అన్ని ఆపదలను అవకాశంగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది.భారత్‌పై ప్రధాని మోడీపై వెటకారపు మాటలను అంతా ఖండిస్తున్నామని సెహ్వాగ్ వెలువరించిన స్పందనను అమితాబ్ సమర్థించారు.అందాలలో లక్షద్వీప్ ప్రత్యేకత తిరుగులేనిది. అక్కడ సముద్ర తీర రమణీయత చాలా బాగుంటుంది. ఎగిసిపడే అలల సముద్రాన్ని సువిశాల బీచ్‌ల నుంచి తిలకించడం ఓ చెప్పలేని అనుభూతి అని , రమణీయత ఇంత నమ్మశక్యం కాకుండా ఉంటుందా? అన్పిస్తుంటుందని లక్షద్వీప్ సందర్శనల బాటసారుల్లో తానూ ఒక్కడిని అని తెలిపారు.

ఇండియా ట్రిప్పు ముందు తరువాతే అన్ని ః ధోనీ
పర్యాటకులు అయితే ముందుగా భారతదేశంలోని పర్యాటక స్థలాలను సందర్శించండి , ఆ తరువాతనే విదేశీ టూర్లకు వెళ్లండని ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ వెలువరించిన ట్వీటు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. గతంలో ఎప్పుడో ఆయన సామాజిక మాధ్యమంలో వెలువరించిన సందేశం ఇప్పుడు మాల్దీవులతో భారత్ వివాదం దశలో తిరిగి సామాజిక మాధ్యమంలో వెలువడింది.
మనదగ్గర బోలెడు అందాలు ..సౌకర్యాలు పెంచాలి
సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, రైనా స్వదేశీ బ్యాటింగ్
లక్షద్వీప్, మాల్దీవు వివాదం నేపథ్యంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. భారత్ పర్యాటకాన్ని కించపరిచే మాల్దీవుల నేతల స్పందనలపై సెహ్వాగ్ ఇతర క్రికెటర్లు చురకలంటించారు. లక్షద్వీప్ ఒక్కటే కాదు మరెన్నో ప్రాంతాల్లో రమణీయత ఉంది. ఉడిపిలోని బీచ్‌లు, పాండి ప్యారడైజ్ తీరం , అండమాన్‌లోని నీల్, హేవ్‌లాక్ చూస్తే తిరిగితిరిగివెళ్లుతారని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికీ మనం అన్వేషించకుండా ఉన్న సుందర స్థలాలు అనేకం ఉన్నాయి. వీటిపై వెలుగు ప్రసరింపచేస్తే మరింత ఏర్పాట్లు జరిగితే మనం నెంబర్ 1 అవుతామన్నారు. ఎవరైనా కొత్త ప్రదేశాలు చూస్తే వాటిపై స్పందిస్తే మనం మన పర్యాటక రంగాన్ని వృద్థిచేసినట్లు అవుతుందన్నారు.

మరో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ తాను చిన్ననాటి నుంచే పలు దేశాలూ పర్యటిస్తూ వచ్చానని, ఆయా దేశాలు వాటి సంస్కృతికి అనుగుణంగా స్పందిస్తూ వస్తాయని, అయితే భారతీయ ఆతిధ్యం అన్నింటా మిన్న అనేది నానుడి అని తెలిపారు. మాల్దీవుల నుంచి భారత్‌కు వ్యతిరేక స్పందనలు రావడం బాధాకరం అన్నారు యువ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ ఇప్పుడు భారతీయ ఆత్మగౌరవానికి విఘాతం రీతిలో స్పందనలు వెలువడ్డాయి. వీటిని మనమంతా దేశీయ పర్యాటకాన్ని మరింత ప్రోత్సహిస్తూ కువిమర్శకులకు జవాబు చెప్పడం తగు విధమైన బ్యాటింగ్ అవుతుందని రైనా స్సందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News