Monday, April 29, 2024

యావత్ దేశానికి స్పూర్తి దాయకం

- Advertisement -
- Advertisement -

An inspiration to the whole country: minister koppula

పార్లమెంటు భవనానికీ అంబేద్కర్ పెట్టాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకమని ఎస్‌సి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా దళితులను సుసంపన్నం చేసేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి దళితుల పక్షపాతిగా చాటుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత పక్షపాతి అన్న పేరును సార్థకం చేశారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ అందించిన అరుదైన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం యావత్ భారతదేశానికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News