Monday, April 29, 2024

చందమామ కథలు లాంటి ఫాంటసీతో…

- Advertisement -
- Advertisement -

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. యస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా యస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోకి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇందులోని ‘నీలి నీలి ఆకాశం…’ సాంగ్ 300 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టుకొని సెన్షేషనల్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చింది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మీడియాతో ముచ్చటిస్తూ విశేషాలు…

యాంకర్ ప్రదీప్ ఛాయలు లేకుండా…
దర్శకుడు మున్నా ఈ కథను నాకు చెప్పినపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. యాంకర్ ప్రదీప్ ఛాయలు ఎక్కడా లేకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మున్నా రాసుకున్న రెండు క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే వేరియేషన్స్, గెటప్స్ బాగున్నాయి. చందమామ కథలు లాంటి ఫాంటసీతో పాటు ఇంటర్వెల్ నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
ట్విస్టులు ఆసక్తికరంగా…
ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. లవ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ దాని ట్రీట్‌మెంట్ వేరేగా ఉంటుంది. అలాగే ఈ సినిమా కథలో వచ్చే ట్విస్టులు ఇంకొంచెం ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే కోర్ పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అంతా మారుతుంది.
ఆ పాటే సినిమాకు లైఫ్…
ఈ సినిమా మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ‘నీలి నీలి ఆకాశం…’ పాట మ్యూజికల్ హిట్‌గా నిలవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఆ పాటే సినిమాకు లైఫ్ ఇచ్చింది.
అప్పుడు నిరాశపడ్డాను…
సినిమా విడుదలకు థియేటర్స్ దొరికాయి… విడుదలకు ఇంకా మూడు రోజులు ఉన్నాయనగానే లాక్ డౌన్ పెట్టడంతో ఎంతో నిరాశపడ్డాను. ఆతర్వాత ఓటిటి రిలీజ్ అంటే మరో టెన్షన్ మొదలైంది. చివరికి మా ప్రొడ్యూసర్ సిల్వర్ స్క్రీన్ పైనే నా మొదటి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ఇప్పుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.
సక్సెస్‌పై పూర్తి నమ్మకంతో…
మా సినిమాను కొంతమంది బయట వారికి చూపించాం. వారిలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్లు ఉన్నారు. వారందరికీ కూడా మా సినిమా నచ్చింది. అలాగే పలువురు సినీ ప్రముఖులకు మా చిత్రం బాగా నచ్చడంతో సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాము.

Anchor Pradeep Full Interview 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News