Monday, April 29, 2024

రష్యా గ్రంథాలయాల్లో అన్నాభావ్ విగ్రహాలు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ముంబయి: అన్నాభావే సాటే వంచిత, పీడిత ప్రజలకు అండగా నిలిచారని సిఎం కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని వాటేగామ్ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాభావే సాటేను లోక్‌షాహెర్ బిరుదుతో సత్కరించారని, సమస్యలను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. అన్నాభావ్‌ను రష్యా గుర్తించినా భారత్ మాత్రం పట్టించుకోలేదని కెసిఆర్ దుయ్యబట్టారు. రష్యా ప్రభుత్వం అన్నాభావ్‌ను పిలిపించి సత్కరించిన గొప్ప కవి అనికొనియాడారు.

Also Read: పెద్దల సమ్మతితోనే ప్రేమ పెళ్లిళ్లపై అధ్యయనం చేస్తాం: గుజరాత్ సిఎం

రష్యాలోని గ్రంథాలయాల్లో అన్నాభావ్ విగ్రహాలు ప్రతిష్టించారని, రష్యా కమ్యూనిష్టు నేత మ్యాక్సిమ్ గోర్కి నవల మా ప్రపంచ ప్రసిద్ధి అని కొనియాడారు. రష్యా ప్రభుత్వం అన్నాభావ్‌ను భారత మ్యాక్సిమ్ గోర్కి అని ప్రశంసించిందని గుర్తు చేశారు. అన్నాభావ్ రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, రచనలు ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు అని సార్వజనీనం అని, రచనలను ఇప్పటికైనా దేశ భాషల్లో ప్రచురించాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. అన్నాభావ్‌కు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని, భారతరత్నపై తెలంగాణ కూడా సిఫారసు చేస్తుందని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News