Sunday, May 12, 2024

బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మరి ఇద్దరికి కొవిడ్

- Advertisement -
- Advertisement -

18కి చేరిన బాధితుల సంఖ్య
ఈ నెల 9 తర్వాత యుకె నుంచి వచ్చిన వారు 04024651119 నంబర్‌కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్సప్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి
ఇళ్లకు వెళ్లి పరీక్ష చేస్తామని వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోని మరి ఇద్దరిలో శనివారం నాడు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందినవారు. మొత్తం ఇప్పటివరకు 18 మందికి కరో నా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుం చి నలుగురు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజివ్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. 18 మం దిని వివిధ ఆసుప్రతుల్లో ప్రత్యేక వార్డులో ఉంచామని, 18 మందికి 79 మంది అతి సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. వారిని క్వారేంటిన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నామన్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారందరికీసంబంధించిన శాంపిల్స్ ఏ వైరస్ తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం సిసిఎంబికి పంపించామన్నారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయని వెల్లడించారు.

యుకె నుండి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించామని, మరో 184 మందికి సంబంధించిన వివరాలు సమగ్రంగా లేవన్నారు. వారి అడ్రస్‌లు, ఫోన్ నెంబర్స్ సరిగా లేవని, వారందరిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాస్తున్నామని తెలిపారు. కావున డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యుకె నుండి వచ్చిన వారు లేదా యుకె గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 04024651119 నంబర్‌కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్సప్ ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్డందీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలు ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామన్నారు. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన వసరం లేదని.. కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ తప్పనిసరిగా వాడండి.. భౌతిక దూరం పాటించడం.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండని డాక్టర్ శ్రీనివాస్‌రావు ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ కొత్త స్టెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తోంది. యుకు నుండి వచ్చిన వారి వివరాలుసేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 1216 మంది యుకె నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించింది.

Another 2 UK Returnees Test Positive in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News