Friday, April 26, 2024

62 కేసులు

- Advertisement -
- Advertisement -

Corona positive cases

 

n కొత్తవన్నీ మర్కజ్ లింక్‌వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు
n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్‌లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 333 కి చేరగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 33గా ఉంది. మిగతా 289 మంది గాంధీ, ఉస్మానియ, ఫీవర్ , చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన కేసులన్నీ మర్కజ్ లింక్ నుంచే వస్తున్నాయి. మరో రెండు రోజుల వరకు కేసులు క్రమంగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొన్న వారిని, వారి ఫ్యామిలీలను పూర్తిగా క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడిస్తున్నారు. మరో 800 శాంపిల్స్‌కు వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కరోనా కంట్రోల్ కోసం వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపారు.

కన్హ శాంతి వనం సమీపంలో800 మంది క్వారంటైన్…….
కరోనా నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కన్హ శాంతివనం సమీపంలో సుమారు 800 మందిని క్వారంటైన్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతంలోని ఓ మహిళ చనిపోయిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు, ఊర్లో వాళ్లందరిని అధికారులు క్వారంటైన్‌కి పంపించారు. ఆదివారం కన్హా శాంతివనాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్ అమయ్‌కుమార్ సూచన మేరకు జిల్లా వైద్యాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం, సరిహద్దులో చెక్‌పోస్ట్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న వారి చేతులపై క్వారంటైన్ ముద్రలు కూడా వేసినట్లు అధికారులు వివరించారు. 140 మంది ఆశావర్కర్లు, 58 మంది ఏఎన్‌ఎంలు తదితర వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు..

గోదావరిఖనిలో కరోనా కలకలం..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కరోనా కలకలం రేపింది. జి.యం కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోన అనుమానిత లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను సుల్తానాబాద్ ఐసొలేషన్ కేంద్రానికి తరలించినట్లు సమాచారం.

హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి గుండెపోటు..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన పడమటి రాములు అనే వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉండగా, ఆదివారం ఆకస్మత్తుగా గుండె పోటు వచ్చి మరణించారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన అతనికి జిల్లా వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆరోగ్యంగానే ఉండటంతో అతన్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అధికారులు సూచనలు మేరకు ఈ వ్యక్తి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కానీ ఆదివారం హార్ట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందడం విషాదకరం.

 

Another 62 Corona positive cases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News