Saturday, April 27, 2024

విరాళాలకు పన్ను మినహాయింపు

- Advertisement -
- Advertisement -

CM Relief fund

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు ఇచ్చే డబ్బుకు ఆదాయపన్ను మినహాయింపు ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి బాసటగా అనేకమంది సిఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఎలా ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారని ట్విట్టర్ వేదికగా అనేక మంది నెటిజన్లు కెటిఆర్‌దృష్టికి తీసుకువచ్చారు. ఈమేరకు కెటిఆర్ స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేవారికి అనేక విషయాలు తెలిపారు. సిఎం రిలీఫ్ ఫండ్‌కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబర్ 62354157651, అకౌంట్ పేరు సిఎం రిలీఫ్ ఫండ్, బ్రాంచ్ సెక్రటరేట్,హైదరాబాద్, కోడ్ నంబర్ 020077, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ ఎస్ బి ఐ ఎన్ 0020077కు పంపించాలని కెటిఆర్ తెలిపారు. సిఎం రిలీఫ్‌ఫండ్‌కు ఇచ్చే విరాళాలకు ఇన్‌కంటాక్స్ సెక్షన్80(జి) ఐటి యాక్ట్ 1961 మేరకు పన్ను రాయితీ ఉంటుందని కెటిఆర్ వివరించారు.

 

Tax relief for CM Relief fund donations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News