Monday, April 29, 2024

అన్నీ అనుకున్నట్లు జరిగితే… జనవరినాటికి వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Anthony Fauci hopes Vaccine by January

 

మరికొద్ది వారాల్లో మోడెర్నా, ఫైజర్ ప్రయోగాల తుది నివేదికలు
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం

వాషింగ్టన్: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అధిక ప్రమాదం పొంచిఉన్న అమెరికన్లకు డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి ప్రారంభంలో టీకా లభించే అవకాశముందని అమెరికా అంటువ్యాధుల నిపుణులడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తంచేశారు. టీకా ఆమోదం కోసం ముందు వరసలో ఉన్న మోడెర్నా, ఫైజర్ సంస్థల తాజా అంచనాల నేపథ్యంలో ట్విట్టర్, ఫేస్‌బుక్ లైవ్‌చాట్‌లో పాల్గొన్న ఫౌచీ ఈ సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘ మనకు సురక్షితమైన, ప్రభావవంతమైన టీకా అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయం డిసెంబర్‌లో తెలిసే అవకాశముంది. తుది దశకు సంబంధించిన తాత్కాలిక సమాచారం కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఫౌచీ వెల్లడించారు. మోడెర్నా, ఫైజర్ సంస్థలు తుది దశ ప్రయోగాలు గత జూలైలో ప్రారంభించగా వేలాది మంది వలంటీర్లు వాటిలో పాల్గొన్నారు. వచ్చే నెలలో వాటికి సంబంధించిన తాత్కాలిక సమాచారాన్ని వెల్లడించనున్నట్లు మోడెర్నా గురువారం వెల్లడించింది.

అలాగే అక్టోబర్ చివరి నాటికి తమ ట్రయల్స్ వివరాలు వెల్లడిస్తామన్న ఫైజర్ మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నవంబర్ 3న ఈ సమాచారాన్ని ఇవ్వనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మొదట ఈ సమమాచారాన్ని సమీక్షించి .. ట్రయల్స్ విజయవంతమయితే ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలో సిఫార్సు చేస్తాయి. అన్నీ సక్రమంగా జరిగి డిసెంబర్ చివరి నాటికి జనవరి ప్రారంభంలో అందుబాట్లుకి వచ్చే ఆ టీకాలను అధిక ప్రమాదం పొంచి ఉన్న వారికి ముందుగా అందిస్తారని ఫౌచీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రభావవంతమైన టీకా అందుబాటులోకి వచ్చినా 2021 చివరి నాటికి కూడా సాధారణ జీవితం తిరిగి రాకపోవచ్చని కూడా ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News