Friday, May 3, 2024

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఎపి ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్థానికత కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఎపి ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్‌కు సిఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. దీంతో క్లాస్3, క్లాస్4కు చెందిన 711 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఎపి సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు వస్తున్న ఉద్యోగులకు సిఎం జగన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగుల హర్షం
ఎపి ప్రభుత్వం తమను రిలీవ్ చేయడంతో తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, వెలగపూడిలోని సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాగా, గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సిఎం జగన్ ప్రస్తావించగా.. సానుకూలంగా స్పందించిన కెసిఆర్ సర్కార్ తెలంగాణ నుంచి ఎపికి సంబంధిత ఫైలును పంపింది. ఈ నేపథ్యంలో వెంటనే ఉద్యోగుల బదిలీ ఫైలును క్లియర్ చేసి తెలంగాణకు పంపాల్సిందిగా సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. గొప్ప మనసుతో అంగీకరించి సిఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

AP Govt Relieves 711 Telangana Employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News