Saturday, April 27, 2024

ఎంత కష్టమైనా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: జగన్

- Advertisement -
- Advertisement -

AP SSC and Inter exams 2021 to hold as per Schedule

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఎంతకష్టమైనప్పటికీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని, ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని, విపత్కర సమయంలోనూ అగ్గిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని సిఎం వివరించారు. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనేనని వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నానన్నారు. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పనని, అయితే కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నానని జగన్ అన్నారు.
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు ః
ఎపిలో షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరొన్నారు. ఇంటర్ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు.
హైకోర్టులో పిటిషన్ ః టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ బుధవారం ఎపిహైకోర్టులో విద్యార్థుల పిటిషన్ దాఖలు చేశారు. సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషనర్లు ఈ వ్యాజ్యం వేశారు.

AP SSC and Inter exams 2021 to hold as per Schedule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News