Monday, April 29, 2024

స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Applications invited for self employed scheme

సిద్దిపేట: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా షెడ్యూల్ కాస్ట్ కార్యాచరణ పథకం 2020-21 కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం రూ. 28కోట్ల 35లక్షలతో 657 మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ పథకాలు కార్పొరేషన్ ద్వారా అందించనున్నట్టు మంత్రి తెలిపారు. కార్పొరేషన్ ద్వారా ఇందులో రాయితీ కింద ప్రభుత్వం రూ. 18కోట్ల 9లక్షల 86 వేలు భరిస్తుందని తెలిపారు. వీటిలో బ్యాంక్ అనుసంధాన స్వయం ఉపాధి పథకాల ద్వారా రూ. 22కోట్ల 7లక్షలతో 424 యూనిట్లు మంజూరు చేయనుండగా.. బ్యాంక్‌లతో సంబంధం లేకుండా 233 యూనిట్లను రూ. 6కోట్ల 28లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్పొరేషన్ ద్వారా 2020, 21 ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ సిద్దం చేశామని అర్హులైన ఎస్సీ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Applications invited for self employed scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News