Thursday, May 16, 2024

రవీంద్రుడు పుట్టిన గడ్డపై విద్వేష రాజకీయాలు సాగనివ్వం

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee to hold mega roadshow in Bolpur

బోల్పూర్(ప బెంగాల్): బిజెపిని బయటి పార్టీగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ పుట్టిన ఈ గడ్డపైన లౌకికవాదంపై విద్వేష రాజకీయాలు గెలుపొందడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు. బోల్పూర్‌లో మంగళవారం ఒక ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ విద్యుత్ చక్రవర్తిని బిజెపికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని విచ్ఛిన్నకర, మతతత్వ రాజకీయాలను చొప్పించి విశ్వవిద్యాలయ కీర్తిప్రతిష్టలను, ఘన చరిత్రను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

మహాత్మాగాంధీని, దేశానికి చెందిన ఇతర మహానాయకులను గౌరవించని వారు సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్) నిర్మిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నో దశాబ్దాల క్రితమే రవీంద్రనాథ్ టాగూర్ సోనార్ బంగ్లాను నిర్మించారని, బిజెపి మతోన్మాద దాడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మన తక్షణ కర్తవ్యమని మమత పిలుపునిచ్చారు. ఇటీవల టిఎంసి నుంచి బిజెపిలోకి జరిగిన వలసలను ప్రస్తావిస్తూ బిజెపి తమ ఎమ్మెల్యేలు కొందరిని కొని ఉండవచ్చు కాని తమ పార్టీని ఎన్నటికీ కొనలేదని ఆమె వ్యాఖ్యానించారు.

Mamata Banerjee to hold mega roadshow in Bolpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News