Friday, May 3, 2024

మతమార్పిడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్

- Advertisement -
- Advertisement -

MP cabinet approves Freedom to Religion Bill 2020

భోపాల్: మోసపూరిత పద్ధతులలో జరుగుతున్న మత మార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం మంగళవారం ఒక ఆర్డినెన్సును జారీచేసింది. పెళ్లి పేరుతోపాటు ఇతర దురుద్దేశాలతో మతమార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష విధించే ఈ ఆర్డినెన్సును గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు ప్రభుత్వం పంపించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం కూడా మత మార్పిడులకు వ్యతిరేకంగా ఆర్డినెన్సు మార్గాన్నే ఎంచుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ బిల్లు, 2020ని రాష్ట్ర క్యాబినెట్ శనివారం ఆమోదించింది. పెళ్లి పేరిట లేదా ఇతర కారణాలతోనైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే రూ. 1 లక్ష వరకు జరిమానా విధించే నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచారు. మంగళవారం ఉదయం జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపారు. కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేక పోయినందువల్ల ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రలోభాలకు గురిచేసి, ప్రభావితం చేసి, బెదిరించి లేదా మాయమాటలు చెప్పి మన ఆడ పిల్లలను వివాహం చేసుకునే వారి ఆట కట్టించడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నాము అని మిశ్రాతెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News