Monday, April 29, 2024

మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం

- Advertisement -
- Advertisement -
Appointment of Returning Officer for ghmc elections
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి

హైదరాబాద్: త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో జరగున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని 30 సర్కిళ్ళలో 61 మంది రిటర్నిగ్ అధికారులను 71 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. సర్కిల్ విస్తీర్ణం, ఆయా సర్కిల్ పరిస్థితులను బట్టి రిటిర్నింగ్ అధికారులను నియమిస్తున్నారు.కొన్ని సర్కిళ్ళలో ఐదుగురికన్నా ఎక్కువగా నియమించగా మరి కొన్సి సర్కిళ్ళలో ఐదుగురిని నియమించారు.

శివారు ప్రాంతాలకు అనుసంధానంగా ఉండే సర్కిళ్ళలో తక్కువగాను సిటీ మధ్యలో ఉండే సర్కిళ్ళలో 5 లేదా 6 మందిని నియమించారు.ఉదాహరణకు సికింద్రాబాద్ సర్కిల్లో 5 రిటర్నింగ్ అధికారులను , మల్కాజిగిరి సర్కిల్లో 6 మంది నియమించగా గాజుల రామారం 4 అల్వాల్ సర్కిళ్ళలో ముగ్గుర్ని నియమించారు. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం కంటే ఎక్కువ శాతం నమోదైయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నిల్లో ఈవీఎంలను ఉపయోగించగా త్వరలో జరగున్న ఎన్నికల్లో మాత్ర బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించేందుకు ఇప్పటికే సన్నాలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లలోని బ్యాలెట్ బాక్స్‌లను పరిస్థితిపై అధికారులు సమీక్ష నిర్వహించారు.

Appointment of Returning Officer for ghmc elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News