Saturday, April 27, 2024

నేడు గణేష్ నిమజ్జనం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28న హైద్రాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, కొలనుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ట్రై కమిషనరేట్ల (హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్) పరిధిలో వినా యక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నగరంలోని ప్రధాన చెరువు ల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే అవకా శం ఉంది. గణేశ్ శోభాయాత్రకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వేల సంఖ్యలో గణనాధులు గురువా రం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. గురువారం హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రై వేట్ సంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది. ఉదయం ఏడు గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. తొలుత బాలాపూర్ గణనాధుడు వద్ద లడ్డూకు వేలం పా టను నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 19 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.

ముఖ్యంగా పాతబస్తీలో గణనాధులు ప్రవేశించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగు నా నిఘాను ఏర్పాటు చేశారు. ఏమాత్రం అనుమానం వ చ్చినా ముందస్తు అరెస్ట్ లు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దారి పొడువునా భక్తుల కోసం గణేశ్ ఉత్సవ స మితి ఆహారం, మంచినీటి సదుపాయాలను కల్పించింది. మధ్యాహ్నం పన్నెండు కల్లా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేలా చూడాలని అధికారులు నిర్వాహకులను కోరారు. వీలయినంత త్వరగా ముగిస్తే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉంటుందని తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ గణేశ్‌ను నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేస్తారు. ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే భారీ క్రేన్ల ను ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబరు 4వ వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయడానికి అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. గురువారం నగరమంతా శోభాయమానంగా, గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలతో మారుమోగనుంది.

పోలీసుల భారీ బందోబస్తు.. పటిష్ట నిఘా…
ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 40 వేలకు మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. 19 కిలోమీటర్ల పాటు గణేష్ విగ్రహాల శోభాయాత్ర సాగనుంది. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు వినాయక వి గ్రహాల శోభాయాత్ర సాగనుంది. బాలపూర్ గణేష్ విగ్రహం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఖైరతాబాద్ వినాయక విగ్రహాం ప్రధానమైంది. వినాయక విగ్రహాల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగ ర్, సరూర్ నగర్, సఫిల్‌గూడ, కాప్రా, నల్లచెరువు, ఎదులాబాద్‌లలోని చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జ నం ప్రధానంగా కొనసాగుతుంది.

హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది, రాచకొండ పో లీస్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసు సిబ్బం ది బందోబస్తు విధులు నిర్వహించ నున్నారు. మరో వైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో ఐదు వేలకు పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటా రు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు 125 స్పెషల్ ప్లా టూను పోలీస్ సిబ్బంది కూడ విధులు నిర్వహించనున్నారు. వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగే మార్గం లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు అం బులెన్స్‌లను కూడ సిద్దంగా ఉంచారు. మరో వైపు హుస్సే న్ సాగర్ చుట్టూ కూడ వైద్య శిబిరాలు, మంచినీటి ప్యా కెట్లను సిద్దం చేశారు. పది లక్షలకు పైగా మంచినీటి ప్యాకెట్లను జిహెచ్‌ఎంసి సిద్దం చేసింది. ప్రతి విగ్రహానికి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి వినాయక విగ్రహానికి నెంబర్ కేటాయించారు.
కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ…
మరో వైపు పోలీస్ కమాండ్ సెంటర్ నుండి అన్ని శాఖల అధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.ఇదిలా ఉంటే వినాయక విగ్రహా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా 3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు.సుమారు 400 మంది గజ ఈతగాళ్లను కూడ సిద్దంగా ఉంచారు. వినాయక విగ్రహాల శోభాయాత్రను పురస్కరించుకొని గురు, శుక్రవారాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. శోభాయాత్ర కోసం ఆర్‌టిసి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. 535 బస్సులను శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసినట్టుగా ఆర్‌టిసి పకటించింది.
అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు సర్వీసులను అందుబాటులో ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ సేవలను భాగ్యనగర వాసులు ఉపయోగించుకోవాలని మెట్రో విభాగం సూచించింది. అలాగే ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. హైదరాబాద్‌కు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జంటనగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం గణేశ్ శోభాయాత్ర ఉండటంతో భారీ వర్షం అడ్డంకిగా మారుతుందా? అన్న అనుమానం కలుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News