Sunday, April 28, 2024

ఖేల్ రత్న  కోసం అశ్విన్, మిథాలీ పేర్లు

- Advertisement -
- Advertisement -

Ashwin and Mithali names recommended for Khel Ratna

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు తమ తమ క్రీడాకారులు పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఈసారి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోసం భారత సీనియర్ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్ పేర్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. టీమిండియాలో అశ్విన్ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అశ్విన్ ఇప్పటికే టెస్టుల్లో 413, వన్డేల్లో 150, టి20లలో 42 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో అశ్విన్ పేరును బిసిసిఐ ఖేల్ రత్న పురస్కారం కోసం సిఫార్సు చేసింది. మరోవైపు టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పేరును కూడా ఖేల్ రత్న కోసం బిసిసిఐ ప్రతిపాదించింది. మిథాలీ ఇప్పటికే 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థావాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. మహిళా క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న మిథాలీకి ఖేల్ రత్నతో సత్కరించాలని బిసిసిఐ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసుకుంది. ఇక భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ పేరును కూడా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం కోసం భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతిపాదించింది.

కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్‌కు ఛెత్రీ పెద్దు దిక్కుగా నిలిచిన విషయం తెలిసిందే. అసాధారణ ప్రతిభతో ప్రపంచంలోని అత్యత్తుమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడిగా ఛెత్రీ పేరు తెచ్చుకున్నాడు. అతని సేవలకు గుర్తింపుగా ఖేల్ రత్న అవార్డుతో సత్కరించాలని ఫుట్‌బాల్ సమాఖ్య దరఖాస్తు చేసుకుంది. ఇక అర్జున అవార్డుల కోసం కూడా పలువురు క్రీడాకారుల పేర్లను ప్రస్తావించారు. క్రికెటర్లు శిఖర్ ధావన్, జస్‌ప్రీత్ బుమ్రా, కెఎల్.రాహుల్ పేర్లను అర్జున అవార్డుల కోసం బిసిసిఐ సిఫార్సు చేసింది. మరోవైఉ భారత రెజ్లింగ్ సమాఖ్య సయితం నలుగురు రెజ్లర్ల పేర్లను అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించింది. రవి దహియా, దీపక్ పునియా, అన్షుమలిక్, సరిత పేర్లను రెజ్లింగ్ సమాఖ్య సిఫార్సు చేసింది. ఇదిలావుండగా ఇతర క్రీడా సంఘాలు కూడా అర్జున అవార్డుల కోసం క్రీడాకారుల పేర్లను ప్రతిపాదించాయి. అయితే వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Ashwin and Mithali names recommended for Khel Ratna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News