Tuesday, April 30, 2024

ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 2న పాక్‌-భారత్ సమరం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్థాన్ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయి. పోటీల్లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ జట్లకు చోటు దక్కింది.

ఆగస్టు 30న పాకిస్థాన్‌నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్‌కు తెరలేవనుంది. ముల్తాన్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు జరుగనుండగా ఫైనల్‌తో సహా మిగిలిన పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ రెండున కొలంబో వేదికగా పోరు జరుగనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి ఇందులో మొదటి రెండు స్థానాలు దక్కించుకున్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.

ఫైనల్ సమరం సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ముల్తాన్, కాండీ, లాహోర్, కొలంబో నగరాలు ఆసియా కప్‌కు వేదికలుగా నిలువనున్నాయి. నిజానికి ఆసియాకప్ పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ పద్ధతిలో ఆసియాకప్‌ను నిర్వహిస్తున్నారు. శ్రీలంక, పాకిస్థాన్‌లు ఈ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News