Monday, April 29, 2024

భారత్ అండర్19 టీమ్‌లో అవనీష్, అభిషేక్‌లకు చోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆసియా అండర్19 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ శనివారం ఎంపిక చేసింది. యుఎఇ వేదికగా డిసెంబర్ 8 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఆసియాకప్ కోసం 15 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించింది. భారత జట్టుకు ఉదయ్ సహారన్ (పంజాబ్) కెప్డెన్‌గా ఎంపికయ్యాడు. సౌమీ కుమార్ పాండే (మధ్యప్రదేశ్) వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్‌లకు కూడా భారత జట్టులో చోటు లభించింది. వీరిని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అభినందించారు. ఈ టోర్నీలో ఇద్దరు మెరుగైన ఆటతో అలరించాలని ఆకాంక్షించారు. కాగా, ఆసియాకప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, యుఎఇ, జపాన్ జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబర్ 8 నుంచి 17 వరకు ఈ టోర్నీ జరుగనుంది.

జట్టు వివరాలు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్), సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లించాబి, నమన్ తివారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News