Monday, May 6, 2024

ఏసియన్ పెయింట్స్ అదుర్స్

- Advertisement -
- Advertisement -

Asian Paints consolidated net profit up 84%

 

క్యూ4లో లాభం రూ.852 కోట్లతో 84% వృద్ధి

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం (2020-21) నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఏసియన్ పెయింట్స్ రాణించింది. కంపెనీ నికర లాభం రూ.852 కోట్లతో 84 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.462 కోట్లుగా ఉంది. సంస్థ ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ. 6,651 కోట్లతో 43 శాతం వృద్ధిని సాధించింది. పిబిడిఐటి రూ. 1,318 కోట్లతో 53 శాతం పెరిగింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ అమిత్ సింజిల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో క్యూ4లో కంపెనీ పటిష్టమైన లాభాలను నమోదు చేసిందని అన్నారు. క్యూ2, క్యూ3 రికవరీతో పోలిస్తే ఆఖరి త్రైమాసికంలో వ్యాపార, వినిమయం పరంగా మంచి వృద్ధి ఉందని అన్నారు.

Asian Paints consolidated net profit up 84%
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News