Monday, April 29, 2024

అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనలో ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో పిజెఆర్ కుమారుడు, మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్ధన్రెడ్డికి అనుయాయులు ఎంట్రీ ఇచ్చారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. సభను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. కాగా జూబ్లీహిల్స్ నిజయోకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.

ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో మోరాదాబాద్ (యూపి) నుంచి ఎంపిగా గెలిచారు. మరోవైపు 2019 లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా అతనికి సీటు దక్కలేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి ఆజారుద్దీన్ పోటీ చేస్తారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన సభకు విష్ణు వర్గీయులు అడ్డు తలగడంతో ఆజారుద్దీన్ వర్గీయులు వారితో గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News