Saturday, April 27, 2024

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) రెండోదశ అడ్మిషన్లు

- Advertisement -
- Advertisement -

B.Ed (Special Education) Second Phase Admissions in Ambedkar University

 

మనతెలంగాణ/ హైదరాబాద్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) రెండో దశ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధ్యయన కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ ద్వార నిర్వహిస్తునున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ స్కాన్ కాపీలను www.braouonline.in లో డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఫేజ్- 1 కౌన్సిలింగ్‌లో నమోదు చేసుకోని వారు మాత్రమే నమోదు చేసుకోవాలి అని తెలిపారు. అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్‌లను ఈ నెల 21, 22వ తేదీలలో ఆన్‌లైన్‌లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం www.braouo.ac.in, www.braouonline.inలో చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News