Monday, April 29, 2024

గంగమ్మ ఒడిలో ‘ఓ గంగ’

- Advertisement -
- Advertisement -

Baby Girl Found Abandoned in Wooden Box Floating in Ganga river

దత్తత తీసుకున్న యుపి సర్కారు

ఘాజీపూర్ : ఉత్తరప్రదేశ్‌లో పరవళ్లు తొక్కుతున్న గంగానదిలో అలంకరించి ఉన్న ఓ చెక్కపెట్టె అలలపై తేలియాడుతూ కన్పించింది. ఘాజీపూర్ జిల్లాలో దాద్రీ ఘాటు వద్ద ఒడ్డున అటూ ఇటూ కదులుతున్న పెట్టెలో నుంచి పసికందు ఏడుపు విన్పించడంతో పడవ వారు ఈ పెట్టెను వెలికి తీసి చూడగా అందులో ముక్కుపచ్చలారని 22 రోజుల పసికందు కన్పించింది. పెట్టెలో హిందూ దేవతల ఫోటోలు , ఈ పసికందు జాతకచక్రం వంటివి పెట్టి ఉంచారు. పాపను ఒ మొత్తటి దుప్పట్లో చుట్టి ఉంచారు. పెట్టెలో మహాభారత కథలో కర్ణుని మాదిరిగా దొరికిన ఈ పసికందు వైనం సంచలనం కల్గించింది. స్థానికులు విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు.

వెంటనే వారు వచ్చి స్థానిక అక్షా జ్యోతి ఆసుపత్రికి బేబీని తరలించి పరీక్షలు నిర్వహించారు. బిడ్డకు అక్కడి వారు గంగ అనే పేరు పెట్టారు. ఈ పసికందు విషయం తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.ఈ బిడ్డ ఆలనాపాలనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, అన్ని విధాలుగా పెంచుతుందని లక్నోలో తెలిపారు. ఈ బిడ్డను గంగలో వదిలివెళ్లిన వారెవ్వరో కానీ బిడ్డ ప్రాణాలతో ఉండాలనే ఆశలతో అన్ని జాగ్రత్తలు తీసుకుని పడవవారు, గ్రామస్తులు ఎక్కువగా తిరిగే చోటుచూసుకుని చెక్కపెట్టెలో సున్నితంగానే వదిలి, అత్యంత కర్కశంగా రోజుల బిడ్డను నదిపాలు చేసి వదిలారని స్థానికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News