Sunday, May 5, 2024

బాఘ్‌జన్ సహజవాయువు మంటలు ఆర్పివేత

- Advertisement -
- Advertisement -

Baghjan natural gas well is finally extinguishing fires

 

న్యూఢిల్లీ : అస్సోం లోని బాఘ్‌జన్ సహజ వాయువు బావి మంటలను ఎట్టకేలకు తాము ఆర్పివేయ గలిగామని ఆయిల్ ఇండియా ఆదివారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా ఈ బావి నుంచి గ్యాస్ లీకై మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. మంటలను పూర్తిగా విదేశీ నిపుణుల సహాయంతో అదుపు చేయగలిగామని ఇప్పుడు ఆ బావిలో సహజవాయువు ఒత్తిడేమీ లేదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ బావి వద్ద హైడ్రోకార్బన్ కనుగొన్నామని నిర్ధారించిన రెండు రోజుల తరువాత కంపెనీ ఈ ప్రకటన వెలువరించింది. గ్యాస్ ఉత్పత్తి పెంపునకు కొత్తగా మరికొన్ని చోట్ల బావి తవ్వకాలు చేపడతామని వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News