Saturday, April 27, 2024

బాహుబలి సెంటిమెంట్‌ను అనుసరిస్తూ…

- Advertisement -
- Advertisement -

Bahubali centiment on radhe shyam first look

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విశేష స్పందన దక్కించుకుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రభాస్ ఓ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ స్టార్ హీరో నటించిన ‘బాహుబలి 1’ విడుదలైన జులై 10న ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా బాహుబలి సెంటిమెంట్‌ని అనుసరించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ విడుదల 2021లో అని చిత్ర బృందం ధృవీకరించింది. ఇక ‘బాహుబలి 2’ విడుదలైన ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని కూడా విడుదల చేసే అవకాశం కలదు. ప్రభాస్ ఈ రిలీజ్ డేట్‌నే టార్గెట్ చేశాడని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ 50 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా నాలుగు భాషలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News