Friday, May 3, 2024

త్యాగానికి ప్రతీక బక్రీద్

- Advertisement -
- Advertisement -
  • అల్లాదయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
  • బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాగం సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు.ఈ పండుగ సోదర భావం ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరకీ ఎల్లప్పుడు ఉండాలని అభిలాషించారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News