Sunday, April 28, 2024

పి.వి. సంస్కరణలు గొప్పవి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పివి నరసింహారావు సంస్కరణలు గొప్పవని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడి అన్నారు. బుధవారం పి.వి జయంతి సందర్భగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలామల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో జన్మించి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన గొప్ప నేత పివి నరసి ంహారావు అని అన్నారు. పివి నరసింహారావు గొప్ప బహుబాషా కోవిడుదని గుత్తాసుఖేందర్‌రెడ్డి చెప్పారు. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన వారు అన్నారు. రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప రచయిత కూడా పివి నరసింహారావు గుర్తింపు పొందారన్నారు. కవి సామ్రాట్, విశ్వనాథ, సత్యనారాయణ రచించిన వేయి పడుగలు అనే రచనను సహస్రఫన్ అనే పేరుతో పివి నరసింహారావు హిందిలోకి అనువాధం చేశారన్నారు. దేశానికి ఎంతో గొప్పగా సేవ చేసిన ఆయనను గొప్పగా గౌరవించుకునే అవసరం ఉందన్నారు. త్వరలోనే నల్గొండ పట్టణంలో పివి నర్సి ంహారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు యామ దయాకర్, ఐతగోని స్వామిగౌడ్, గోపాల్‌రెడ్డి, హరికృష్ణ, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News